పార్టీ విలీనమే.. షర్మిల ముందున్న మార్గమా ?

49
- Advertisement -

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టి ఇక్కడ బలడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ షర్మిల. రాజన్న వదిలిన బాణంగా రాజన్న రాజ్యం తెస్తానని తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆశించిన స్థాయిలో ప్రజాదరణ లభించడం లేదు. దాంతో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నప్పటికి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనేది ఆమెకు కూడా తెలిసిన సత్యం. అయినప్పటికి రాష్ట్రంలో నిలదొక్కునునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది వైఎస్ షర్మిల. ఇదిలా ఉంచితే కాంగ్రెస్ పార్టీ ఆమె తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీలకనేతగా ఎనలేని సేవలందించారు. .

దాంతో వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో మంచి సాన్నిహిత్యం ఉండేది. కానీ వైఎస్ఆర్ మరణించిన తరువాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పార్టీ పెట్టడం. ఆ తరువాత కాంగ్రెస్ తో విభేదించడం అన్నీ చక చక జరిగిపోయాయి. ఇటు వైఎస్ షర్మిల కూడా తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి కాంగ్రెస్ తో సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం వైఎస్ కుటుంబంపై ప్రేమ కురిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశం ఉందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తరువాత ఈ వార్తలు మరింత పెరిగిపోయాయి.

Also Read: Pawan:బీజేపీకి “పవన్ సెగ ” !

కాగా తాజాగా ఈ వార్తలపై వైఎస్ఆర్ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 43 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ బలంగా ఉందని, తమకు వేరే పార్టీలో విలీనం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో బి‌ఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనేది కొందరి అభిప్రాయం. అందువల్ల కాంగ్రెస్ లో విలీనం చేస్తే రాజకీయంగా షర్మిలకు తగిన ప్రాదాన్యం లభించే అవకాశం ఉందనే వాదన కూడా నడుస్తోంది. మరీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము గనుక ఎన్నికల సమయానికి షర్మిల ఉద్దేశంలో మార్పు వచ్చిన ఆశ్చర్యం లేదనేది కొందరి వాదన.

Also Read: సి‌ఎం పదవి ఇవ్వకపోతే.. డీకే రాజీనామా ?

- Advertisement -