- Advertisement -
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు టీమిండియా వికెట్ కీపర్ పార్ధివ్ పటేల్. అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన పార్ధీవ్..తన కెరీర్‌లో 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.
18 ఏళ్ల కెరీర్‌లో తనకు సహకరించిన బీసీసీఐ, అందరు కెప్టెన్లకు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. 2002లో టెస్టు క్రికెట్‌తో భారత్ టీమ్‌లో అడుగుపెట్టిన పార్ధీవ్….. టెస్టుల్లో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు.
2004లో తొలిసారి టీమ్‌లో స్థానం కోల్పోయిన పార్థివ్.. తర్వాత మరోసారి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు పార్ధీవ్.
- Advertisement -