Parliament: లోక్‌సభ నిరవధిక వాయిదా

2
- Advertisement -

నవంబర్ 25న మొదలైన లోక్‌సభ శీతాకాల సమావేశాలు ముగిశాయి.ఈ సమావేశాల్లో పలు బిల్లులకు ఆమోదం తెలిపింది లోక్‌సభ. ప్రధానంగా జమిలి (వన్ నేషన్, వన్ ఎలక్షన్) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

ఒకే దేశం- ఒకే ఎన్నిక బిల్లుపై ఏర్పాటు అయిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) లో తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కు చోటు దక్కింది. శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం పార్లమెంట్‌ వద్ద నిరసన చేపట్టారు. విపక్ష నేతల నిరసనకు పోటా పోటీగా ఎన్డీఏ ఎంపీలు సైతం ప్లకార్డ్‌ లతో ఆందోళనకు దిగారు. దీంతో సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

జ‌మిలి ఎన్నిక‌ల ముసాయిదాను జేపీసీకి పంపాల‌న్న తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్​వాల్​ను స్పీకర్ ఓం బిర్లా కోరారు. ఆ సమయంలో విపక్ష సభ్యులు ‘జై భీమ్’ ‘జై భీమ్’ అని నినాదాలు చేశారు.

Also Read:రామ్ చరణ్‌ అద్భుత…ఆర్టిస్ట్

- Advertisement -