- Advertisement -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. మణిపూర్ అల్లర్లపై లోక్‌సభలో బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం చేసింది. హింసాకాండపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు వాయిదా తీర్మానం నోటీసులు అందజేశారు.
నేటి నుండి ఆగస్టు 11 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ దఫా సమావేశాల్లో కేంద్రం 31 బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నది. ఇందులో ఢిల్లీ ఆర్డినెన్స్, వ్యక్తిగత డాటా పరిరక్షణ, అటవీ పరిరక్షణ చట్టాల సవరణ, సినిమా పైరసీని అరికట్టడం వంటి బిల్లులు ఉన్నాయి.
Also Read:Telangana Rains:రెండురోజులు విద్యాసంస్థలకు సెలవు
- Advertisement -