రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్..

23
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. లోక్‌స‌భతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

దేశంలో 96.88 కోట్ల పైచిలుకు ఓటర్లు ఉండగా కొత్తగా 1.85 కోట్ల మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 2100 ఎన్నికల పరిశీలకులను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. వీరిలో 900 మంది జనరల్ అబ్జర్వర్లు, 450 మంది పోలీస్ అబ్జర్వర్లు, 800 మంది వ్యయ పరిశీలకులు ఉన్నారు. ఇక నాలుగు లేదా ఐదు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

- Advertisement -