పరిణీతి.. దిమ్మతిరిగే ట్విస్ట్‌ ..

203
- Advertisement -

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్ అయింది. దానికి కారణం భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.

అవును పరిణీతి చేసిన ట్వీట్‌ కి పాండ్యా రియాక్ట్‌ అవడమే. ఇక ట్విట్టర్‌ లో సాగిన వీరి సంభాషణతో… ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందన్న వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది.

Parineeti Chopra tweets about her 'amazing partner', Hardik Pandya's

ఇక అసలు విషయానికొస్తే.. ఒక పార్కు పక్కన ఉంచిన సైకిల్‌ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన పరిణీతి.. ‘అద్భుతమైన భాగస్వామితో కచ్చితమైన ప్రయాణం. ప్రేమ ఇప్పుడు గాలిలో తేలియాడుతోంది’ అని ట్వీట్‌ చేసింది. దీనికి హార్దిక్‌ బదులిచ్చాడు. ‘పరిణీతి.. నేను ఊహించవచ్చా? నాకు తెలిసి ఇది బాలీవుడ్‌-క్రికెట్‌ లింక్‌ అయి ఉంటుంది. ఏదేమైనా మంచి ఫొటో’ అని ట్వీట్‌ చేశాడు. వెంటనే స్పందించిన చోప్రా.. ‘హార్దిక్‌.. హహహ. కావొచ్చు. కాకపోవచ్చు. మొత్తానికి నేను చెప్పేది ఏమిటంటే ఆ ఫొటోలోనే క్లూ ఉంది’ అని పేర్కొన్నది.

దీంతో, పరిణీతి… క్రికెటర్‌తో ప్రేమలో పడిందని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కానీ, దీనికి పరిణీతి అనూహ్య ముగింపునిచ్చింది. సదరు భాగస్వామి తన  సైకిల్‌  అని దిమ్మతిరిగే ట్విస్ట్‌ ఇచ్చింది. ఇంకేముందీ…పరిణీతి,పాండ్యాల మధ్య సమ్‌థింగ్‌, సమ్‌ థింగ్‌ అంటూ వచ్చిన వార్తలకి ఈ బాలీవుడ్‌ బ్యూటీ పుల్‌ స్టాప్‌ పెట్టేసింది.

- Advertisement -