యంగ్‌ డైరెక్టర్‌తో బాలయ్య 103

156
Paisa vasool movie release date out
Paisa vasool movie release date out
- Advertisement -

గౌతమి పుత్ర శాతకర్ణితో న‌టుడిగా వంద సినిమాలు పూర్తి చేసి 101వ చిత్రం పైసా వ‌సూల్ తో మరోసారి సూపర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు బాల‌కృష్ణ ‌. అదే జోరుతో తమిళ కమర్షియల్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు బాలయ్య. తాజాగా 103వ సినిమాను కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఈ సారి సీనియర్ డైరెక్టర్ కాకుండా యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. కళ్యాణ్ రామ్ తో ‘పటాస్’, సాయి ధరమ్ తేజ్ తో ‘సుప్రీం హీరో’ సినిమాలు చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం రవితేజతో ‘రాజా ది గ్రేట్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా బాలయ్యకు ఆయన ఓ కథను వినిపించాడట. దానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. గుంటూరుకు చెందిన వాసవి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

- Advertisement -