క్రైమ్ కామెడీ… ‘పారిజాత పర్వం’

16
- Advertisement -

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ ట్రైలర్ తో ముందుకు వచ్చారు. స్టార్ యాంకర్ సుమ కనకాల ట్రైలర్ ని లాంచ్ చేశారు. ”కేక్ కట్ చేసేటప్పుడు లైట్స్ అర్పుతారట, మళ్ళీ లైట్స్ వేసేలోపు కేక్ తో పాటు వాళ్ళ ఆవిడ కూడా మన బండిలో వుండాలి’ అంటూ కిడ్నాప్ ప్లాన్ ని సునీల్ తన గ్యాంగ్ తో చెబుతుండగా మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’అనే ట్యాగ్ లైన్ ని జస్టిఫై చేస్తూ ఇందులో చూపించిన సన్నివేశాలు హిలేరియస్ గా వున్నాయి. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్.. ఇలా సినిమాలోని ప్రధాన పాత్రల చుట్టూ నడిపిన కిడ్నాప్ సీక్వెన్స్ లు హైలెట్ గా ఉంటూ కథపై చాలా క్యురియాసిటీని పెంచాయి. యాక్షన్, కిడ్నాప్ డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ తో ట్రైలర్ అలరించింది. ట్రైలర్ చివర్లో వైవా హర్ష చెప్పిన సినిమా రివ్యూ హిలేరియస్ గా వుంది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ అందరూ తమ ఫెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు.

దర్శకుడు సంతోష్ కంభంపాటి హిలేరియస్ కిడ్నాప్ డ్రామాని ప్రేక్షకులకు అందించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ట్రైలర్ లో వినిపించిన పాట, నేపధ్య సంగీతం క్యాచిగా ఉంటూ ఫన్ ని మరింతగా ఎలివేట్. బాల సరస్వతి కెమరామెన్ పనితనం ఆకట్టుకుంది. విజువల్స్, నిర్మాణ విలవలు ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది.సశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అనంత సాయి సహా నిర్మాత.ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read:వార్‌ 2..క్రేజీ అప్‌డేట్!

- Advertisement -