ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై “హైద్రాబాద్ నవాబ్స్” ఫేమ్ లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “పరిచయం”. ఈ చిత్రం ప్రీ లుక్ ను ఆదివారం విడుదల చేశారు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా తెలిపారు.
విరాట్ కొండూరి,సిమ్రత్ కౌర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నఈ మూవీలో ముఖ్యపాత్రలలో సిజ్జు,రాజీవ్‌కనకాల,పృథ్విరాజ్,పరుచూరివెంకటేశ్వరరావు,రాహుల్‌రామకృష్ణ, ఈరోజుల్లో సాయి, కోటేశ్వరరావు, పద్మజ లంక, పార్వతి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతికవర్గం:సంగీతం : శేఖర్చంద్ర,ఎడిటర్ : ప్రవీణ్పూడి,సినిమాటోగ్రఫీ : నరేష్రానా,ఆర్ట్డైరెక్టర్ :రాజ్కుమార్గిబ్సన్,కోరియోగ్రఫీ : విజయ్మాస్టర్,ఫైట్స్ : రామకృష్ణ,లిరిక్స్ : భాస్కరభట్ల,శ్రీమణి,చీఫ్కోడైరెక్టర్ : సత్యంకలకలపు,నిర్మాత : రియాజ్,రచన&దర్శకత్వం : లక్ష్మీకాంత్చెన్నా.