వినోదాత్మక చిత్రంగా ‘పరారి’..

307
Parare
- Advertisement -

యోగేశ్వర్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పరారి’. ”రన్‌ ఫర్‌ ఫన్‌” అనేది ఉప శీర్షిక. అతిథి హీరోయిన్‌గా నటిస్తోంది. సాయి శివాజీ దర్శకుడు. శ్రీ శంకర ఆర్ట్స్‌ పతాకంపై ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మిస్తున్నారు. ‘పరారి’ చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్‌లో ఓ పబ్‌లో ”గరమ్‌ గరమ్‌ మురిగి మసాల” అనే ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు.

ఈ పాటతో చిత్రీకరణ మొత్తం పూర్తయిందని, షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారు చిత్రబృందం. ఈ పాటలో యోగేశ్వర్‌, ముంబాయికి చెందిన డాన్సర్‌ మినాల్‌ నర్తించారు. భాను కొరియోగ్రఫి అందించారు. రవి అంబట్ల గీతాన్ని అందించారు. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర నిర్మాత జీవీవీ. గిరి తెలిపారు.

Parare

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గిరి మాట్లాడుతూ ”నేను సుమన్‌ అభిమానిని. ఈ సినిమాలో సుమన్‌ కీలకమైన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించారు. ఇంకా అలీ కూడా ఓ మంచి పాత్రని చేశారు. పరారి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తుంది. సస్పెన్స్‌, థ్రిల్‌ అంశాలు కూడా ఉన్నాయి” అని అన్నారు.

దర్శకుడు సాయి శివాజీ మాట్లాడుతూ ” పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. కుటుంబనేపథ్యం కూడా ఉంది. చిత్ర నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నిర్మించారు. యూత్‌ఫుల్‌ ఎలిమెంట్స్‌ అనేకం ఉన్నాయి. అలాగే యువతకు ఓ సందేశం కూడా ఉంది. హైదరాబాద్‌తో పాటుగా బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరిపాం. హీరోగా పరిచయం అవుతున్న యోగేశ్వర్‌ బాగా నటించాడు. సహకరించిన టీమ్‌కు ధన్యవాదాలు” అని అన్నారు.

Parare

”విజయవంతంగా షూటింగ్‌ పూర్తిచేశామని హీరో యోగేశ్వర్‌ తెలిపారు. దర్శకుడు శివాజీ బాగా తీశారని” అన్నారు. ”తొలి సినిమా అయినప్పటికీ అనుభవం ఉన్న వాడిలా చేశాడని” చిత్ర సమర్పకురాలు ప్రత్యూష చెప్పారు. ”ఈ సినిమాలోని ఆరు పాటలు బాగా వచ్చాయి. నిర్మాత గిరి పూర్తి సహకరాన్ని అందించారు” అని సంగీత దర్శకుడు మహిత్‌ నారాయణ్‌ చెప్పారు. ‘హీరో యోగేశ్వర్‌ క్లష్టమైన మూమెంట్స్‌ కూడా అవలీలగా చేశాడని” డాన్స్‌ మాస్టర్‌ భాను ప్రశంసించారు.

‘పరారి’ చిత్రంలో యోగేశ్వర్‌, అతిథి, సుమన్‌, రఘు, షియాజీ షిండే, అలీ, శ్రావణ్‌, మకర్‌దేశ్‌ పాండే, జీవా, కల్పలత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: గురుదేవగా అంజి, ఎడిటర్‌: గౌతమ్‌ రాజు, కొరియోగ్రఫి: జానీ, భాను, ఫైట్స్‌: నందు, సమర్పణ: గాలి ప్రత్యూష, నిర్మాత: జీవివి. గిరి, దర్శకత్వం: సాయి శివాజీ.

- Advertisement -