- Advertisement -
గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గోషామహాల్ నియోజకవర్గం మంగళ్ హాట్ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్ధి పరమేశ్వరి సింగ్ నామినేషన్ వేసేందుకు గురువారం భారీ ర్యాలీతో బయల్దేరారు. నామినేషన్ ర్యాలీలో డివిజన్ ఇంచార్జ్‌లు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,డివిజన్ ప్రజలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు. మంగళ్ హాట్ డివిజన్ అభ్యర్ధిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కోరారు. హైదరాబాద్ అభివృద్దే కేసీఆర్ అభిమతమని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
- Advertisement -