Paralympics: పారాలింపిక్స్‌లో మెరిసిన భారత్

6
- Advertisement -

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో సత్తా చాటింది భారత్. ఇప్పటి వరకు 3 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్య పతకాలతో మొత్తం 20 పతకాలు సాధించింది. ఇక మంగళవారం హైజంప్ లో శరద్ కుమార్, మరియప్పన్ తంగవేలు రెండు పతకాలు సాధించారు.

హైజంప్‌లో T63 విభాగంలో శరద్ కుమార్ రజతం, మరియప్పన్ తంగవేలు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. గత పారాలింపిక్స్‌లో కాంస్య పతకాన్నిగెలిచిన శరద్..ఈసారి రజత పతకాన్ని సాధించాడు.

మరియప్పన్ తంగవేలు పారాలింపిక్స్ 2016లో బంగారు పతకం, 2020లో రజత పతకం, ఈసారి కాంస్య పతకం సాధించారు. వరుసగా మూడు పారాలింపిక్స్‌లో పతకాలు సాధించాడు. గత పారాలింపిక్స్‌లో భారత్ 19 పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.

Also Read:Chandrababu:వైసీపీలో ఉందంతా చరిత్రహీనులే

 

- Advertisement -