చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘పేపర్ బాయ్’..

284
Paper Boy
- Advertisement -

సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపొందించబడుతోంది. హైదరాబాద్, ముంబాయి, లోనవాల, పూణే, కేరళ, గోవా వంటి నగరాల్లో ఈ సినిమా తెరకెక్కింది.

Paper Boy

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని జులై లో విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది పుట్టినరోజు సంధర్బంగా జూన్ 20న “పేపర్ బాయ్” ఫస్ట్ లుక్ ను విడుదల కానుంది. నటీనటులు: సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా.

సాంకేతిక నిపుణులు: కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ : సంపత్ నంది, డైరెక్షన్: వి. జయశంకర్, నిర్మాతలు: సంపత్ నంది,రాములు, వెంకట్, నరసింహ, సంగీతం: భీమ్స్, ఎడిటర్: తమ్మిరాజు, సినిమాటోగ్రఫి: సుందర్ రాజన్. ఆర్ట్: రాజీవ్, స్క్రిప్ట్ కో ఆడినేటర్: సుధాకర్ పావులూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల.

- Advertisement -