సెన్సార్ పూర్తి చేసుకున్న పేప‌ర్ బాయ్ ..

259
Paper Boy Movie
- Advertisement -

సంతోష్ శోభ‌న్ హీరోగా తెర‌కెక్కిన పేపర్ బాయ్ ఆగ‌స్ట్ 31న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యు స‌ర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు. పేప‌ర్ బాయ్ లో సంతోష్ శోభ‌న్‌కు జోడీగా రియా సుమ‌న్, తాన్యా హోప్ న‌టించారు. జ‌య శంక‌ర్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మిలియ‌న్ వ్యూస్ కూడా దాటింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ చిత్రానికి క‌థ ఇవ్వ‌డ‌మే కాకుండా త‌న సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు.

Paper Boy

న‌టీన‌టులు: సంతోష్ శోభ‌న్, రియా సుమ‌న్, తాన్యాహోప్, పోసాని కృష్ణ‌మురళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యాల్లేక రామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్ట త‌దిత‌రులు..సాంకేతిక నిపుణులు: ద‌ర్శ‌కుడు: జ‌య‌శంక‌ర్, నిర్మాత‌లు: స‌ంప‌త్ నంది, రాములు, వెంక‌ట్ మ‌రియు న‌ర‌సింహా, నిర్మాణ సంస్థ‌లు: స‌ంపత్ నంది టీమ్ వ‌ర్క్స్, బిఎల్ఎన్ సినిమా మ‌రియు ప్ర‌చిత్ర క్రియేష‌న్స్, సంగీతం: భీమ్స్ సిసిరేలియో, సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర్ రాజ‌న్, ఎడిట‌ర్: త‌మ్మిరాజు, ఆర్ట్ డైరెక్ట‌ర్: రాజీవ్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ముర‌ళి మామిళ్ళ‌, స్క్రిప్ట్ కో ఆర్డినేట‌ర్: సుధాక‌ర్ పావులూరి, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్.

- Advertisement -