పంకజ్ షా వన్ మ్యాన్‌ షో…413 నాటౌట్

288
Pankaj Shaw hits 413 not out in club league
- Advertisement -

విధ్వంకర బ్యాటింగ్ అంటే మనకు టక్కున గుర్తొచ్చేది…క్రిస్ గేల్,సెహ్వాగ్,వార్నర్. కానీ వీరిని సైతం తలపిస్తు…అసలైన క్రికెట్ మజాను రుచిచూపించాడు బెంగాల్ బ్యాట్స్ మెన్. ఆకాశమే హద్దుగా చెలరేగి…అంతర్జాతీయ క్రికెటర్లు సైతం ముక్కున వేలెసుకునేలా చేశాడు. ఏకంగా 44 ఫోర్లు..23 సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ డివిజన్ టోర్నమెంట్‌లో ఈ అద్భుతం జరిగింది.

44 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన పంకజ్..ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. దొరికిన ప్రతిబంతిని బౌండరీ లైన్ దాటించాడు. పంకజ్ దెబ్బకు దక్షిణ్ కాలికటా సంసాద్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఏకంగా 44 ఫోర్లు….23 సిక్సర్లతో 413 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. పంకజ్ బ్యాటింగ్ విన్యాసంతో బారిషా క్లబ్ జట్టు 708/8 వద్ద డిక్లేర్డ్ చేసింది.

గత సీజన్ లో రాజస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా రంజీల్లో పంకజ్ అరంగ్రేటం చేశాడు. గత సీజన్లో రాజస్తాన్ తో మ్యాచ్ సందర్బంగా రంజీల్లో అరంగేట్రం చేసిన షా.. బెంగాల్ తరపున ఇప్పటివరకూ 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడగా, నాలుగు లిస్ట్-ఎ మ్యాచ్లను, 12 ట్వంటీ 20 మ్యాచ్లను ఆడాడు.

ఆ తర్వాత డీకేఎస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 114.1 ఓవర్లలో 369 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరీశాకు నాలుగు పాయింట్లు దక్కాయి.

- Advertisement -