ఎర్రబెల్లిని కలిసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు..

37
errabelli

త‌మ‌కు ఎప్ప‌టిక‌ప్పుడు దిశానిర్దేశం చేస్తూ, ప‌ల్లె ప్ర‌గ‌తి విజ‌య‌వంతానికి తీవ్రంగా కృషి చేస్తూ, త‌మ క‌ష్ట సుఖాలు, స‌మ‌స్య‌ల్లో పాలు పంచుకుంటూ, సీఎం కెసిఆర్ ద్వారా గ్రామ కార్య‌ద‌ర్శుల వేత‌నాల‌తో స‌మానంగా జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌కు వేత‌నాలు ఇప్పించ‌డంలో కీల‌కంగా ప‌ని చేసిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలుపుతూ రాష్ట్ర జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల సంఘం సోమ‌వారం హైద‌రాబాద్ లోని మంత్రి నివాసంలో ఆయ‌న్ని క‌లిసింది.

ఆ సంఘం అధ్య‌క్షుడు గౌరినేని రాజేశ్వ‌ర‌రావు, స‌హాధ్య‌క్షుడు రామ‌కృష్ణ, ఆకారపు సురేశ్, మ‌నోహ‌ర్ రెడ్డి, మ‌ల్లికార్జున్ త‌దిత‌రులు మంత్రిని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు. అలాగే, ప్రొబేష‌న‌రీ పీరియ‌డ్ ని త‌గ్గించేందుకు కూడా సీఎం గారిని ఒప్పించాల‌ని, అందుకు త‌మ త‌ర‌పున సీఎం గారితోమాట్లాడాల‌ని, త‌ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌కు మేలు చేయాల‌ని వారు మంత్రి ఎర్ర‌బెల్లికి విజ్ఞప్తి చేశారు.