సామజవరగమన వీడియో సాంగ్ ప్రొమో

455
samagavaragamana
- Advertisement -

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డె కథానాయికగా నటిస్తోంది. అల్లు అరవింద్, రాధాకృష్ణ ఈసినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీనుంచి టీజర్ , సాంగ్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈపాటలు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. తమన్ సంగీతం ఈమూవీకి హైలెట్ గా నిలవనుందని తెలుస్తుంది. మొదటగా విడుదల చేసిన సామజవరగమన అనే సాంగ్ వైరల్ గా మారింది. యూట్యూబ్ లో ఈసాంగ్ దాదాపు 100మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది.

సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట మ్యూజిక్ ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించ‌డ‌మే కాక ప‌లు రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సాంగ్‌కి సంబంధించి ప్రోమో వీడియో విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌, పూజా హెగ్డేల లుక్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. కాగా ఈమూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ తో తెరకెక్కుతున్న మూడవ చిత్రం కావడంతో ఈమూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండు చిత్రాలు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. ఇక మూడవ చిత్రం అల..వైకుంఠపురంలో మూవీ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

https://youtu.be/Mw9QBhc8_KQ

- Advertisement -