- Advertisement -
ఆధార్‌తో పాన్ కార్డు లింక్ గడువు రేపటితో ముగిసిపోతుందని బాధపడుతున్నారా..అయితే మీకు ఇది ఖచ్చితంగా తీపి కబురే. ఎందుకంటే ఆధార్‌తో పాన్ అనుసంధానం గడువును మార్చి 31 2020 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏప్రిల్‌లో ఆధార్- పాన్ కార్డు లింక్‌ను కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. తొలుత సెప్టెంబర్‌లో తుది గడువు విధించారు. కానీ తర్వాత దానిని డిసెంబర్ 31 వరకు పొడగించగా తాజాగా మరో మూడు నెలలు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 138ఏఏలోని సబ్‌సెక్షన్ 2 ప్రకారం ఆధార్, పాన్ కార్డును కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది.
- Advertisement -