అగ్నిప్రమాదం.. ప్రధాని నివాసంలో కాదు

387
modi
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అగ్నిప్రమాదం జరిగిందంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ప్రధాని నివాసమైన 7 లోక్ కల్యాణ్ మార్గ్ దగ్గర మంటలు చెలరేగాయన్న వార్తల్లో నిజంలేదని పీఎంవో వెల్లడించింది.

అగ్ని ప్రమాదం జరిగింద ప్రధాని నివాసంలో కాదని లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ఎస్‌పీజీ రిసెప్షన్‌లో మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఎంవో ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

లోక్ కల్యాణ్ మార్గ్ 9 దగ్గర షాట్ సర్క్యూట్ కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంతం ప్రధాని నివాసం లేదా ఆఫీస్ ఏరియా కాదని ప్రస్తుతం మంటలు అదుపులోనే ఉన్నాయని ట్వీట్ చేసింది.

pm modi

- Advertisement -