షాక్..ఈసారి వంట నూనె వంతు!

213
oil
- Advertisement -

ధరల పెంపు…ఈ వార్త వింటేనే ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్,డీజీల్,గ్యాస్‌ ధరల పెంపుతో ప్రజలకు చుక్కలు కనిపిస్తుండగా ఈసారి వంటనూనె ధరల వంతు వచ్చింది. త్వరలోనే వంటనూనెల ధరల మరింత పెరగనున్నాయి.

పంచంలో పామాయిల్ ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ఆ దేశంలో వంట నూనె కొరత ఏర్పడటంతో ఏప్రిల్ 28 నుంచి పామాయిల్ ఎగుమతులను నిషేధించనుందని ఆ దేశాధ్యక్షులు ప్రకటించారు. దీంతో ఆ ప్రభావం ఇతర దేశాలతో పాటు మనదేశంపై కూడా పడనుంది. దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరగగా.. ఇప్పుడు పామ్ ఆయిల్ సరఫరాపై కూడా ఎఫెక్ట్ పడబోతోంది.

- Advertisement -