జపాన్‌లో పడవ గల్లంతు!

118
japan
- Advertisement -

జపాన్‌లో ఓ పర్యాటకుల పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 26 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. దాదాపు 7 గంటలపాటు గాలింపు చేపట్టినా ఒక్కరి అచూకీ కూడా లభించలేదు.

హక్కైడో ఉత్తర ద్వీపంలో షెరిటొకో ద్వీపకల్పం వద్ద శనివారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున గాలులు వీయడంతో ఈ పడవ మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. బోటు ఆచూకీ కోసం నాలుగు హెలికాప్టర్లతో పాటు ఆరు పెట్రోలింగ్‌ బోట్‌లతో గాలిస్తున్నా ఫలితం లేకపోయింది.

లెబెనన్​లో కూడా ఓ బోటు ప్రమాదానికి గురైంది. వలసదారులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడిన ఈ ప్రమాదంలో 60 మంది ప్రయాణికులు ఉండగా.. సహాయక చర్యల్లో 45 మందిని కాపాడారు.

- Advertisement -