పల్లెల రూపురేఖలు మార్చిన పల్లె ప్రగతి- మంత్రి కొప్పుల

183
Minister Koppula Eshwar
- Advertisement -

ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి మండలం జైన, కొస్నూర్ గ్రామాలలో పల్లె ప్రగతితో గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 61లక్షల నిధులతో నిర్మించిన సి.సి రోడ్లు, సైడ్ డ్రైనేజీ లు, కంపోజ్ షెడ్, పల్లె ప్రకృతి వనాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి మొదటి విడత, రెండవ విడత కార్యక్రమంలో పూర్తి కాని పనులకు పూర్తి చేయడానికి రూపొందించిన కార్యక్రమమే పల్లె ప్రకృతితో గ్రామ వికాసం ప్రొగ్రాం. పల్లె ప్రగతితో గ్రామ వికాసం ఒక మంచి గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్నటువంటి దాదాపు ఇరవై మంది నాయకులు దాదాపు 20 మంది అధికారులు కలిసికట్టుగా ఒక గ్రామంలోని ఒక పూట పాటు మూడు నాలుగు గంటలు గ్రామంలో ఉన్నటువంటి పని మళ్ళీ జరిగిన లేదా అనేటువంటి విషయాన్ని తీసుకోవడం కోసం ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

రాష్ట్రంలోనే ధర్మపురి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కేటాయింపు‌, డంప్ యార్డు, వైకుంఠ ధామం, నర్సరీలు, తడిచెత్త, పొడిచెత్త, డంస్ట్ బిన్ వినియోగం, వ్యక్తి గత మరుగుదొడ్లు వినియోగం, డంపిగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో పాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అమలు, మొక్కల పెంపకం, పల్లె ప్రగతి వనం పలు అంశాలు వాటి సమస్యలు పల్లె ప్రగతి పనులలో ఇంక ఏ విధమైన ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని వాటి పూర్తి పరిష్కారానికి రూపొందించిందే పల్లె ప్రగతితో గ్రామ వికాసం కార్యక్రమం అని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి నెలరోజుల పాటు దీనిపై పని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించిన సంగతి అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు గ్రామాలు ఎలా ఉండేవో మనకు తెలుసు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులు బృందంగా ఏర్పడి గ్రామ ప్రజల సహకారంతో గ్రామంలో పర్యటించి, గ్రామ అభివృద్దిలో భాగంగా అమలు చేయబడిన కార్యక్రమాలు, వాటి ప్రగతి మరియు పూర్తిచేయడంలో ఎదురైన సమస్యలను శాస్వత ప్రాతిపధికన పరిష్కారించడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో DCMS ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, MPP చిట్టి బాబు, ZPTC బత్తుల అరుణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు సౌళ్ళ భీమయ్య, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ ఛైర్మన్ సునీల్, PACS ఛైర్మన్ సౌళ్ళ నరేష్, వైస్ యం.పి.పి గడ్డం మహిపాల్ రెడ్డి, సర్పంచ్ లు, ప్రభాకర్ రావు, మహేష్ పాల్గొన్నారు.

- Advertisement -