బీజేపీ బట్టెబాజ్ ముచ్చట్లు పార్టీ- బాల్క సుమన్‌

58
balka-suman

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేబాల్క సుమన్ బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బల్క సుమన్‌ టీఆర్ఎస్‌ భవన్‌లో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పుడు కాదు బండి సంజయ్.. దమ్ముంటే మోడీ సర్కార్ హామీ ఇచ్చిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల చొప్పున ఈ ఆరేండ్లలో 12 కోట్ల ఉద్యోగాలు, అందులో తెలంగాణకు ఎన్ని వచ్చాయో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేసినట్లు లెక్కలతో కూడిన పత్రికా ప్రకటన మీరు విడుదల చేయాలి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేబాల్క సుమన్ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల ప్రతిపక్షలు చేస్తున్న అసత్య ప్రచారంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే.