ప‌ల్లె ప‌ల్లెకు కాంగ్రెస్!

103
revanth reddy
- Advertisement -

వ‌రంగ‌ల్ మీటింగ్ త‌ర్వాత జోష్‌లో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. ముఖ్యంగా వ‌రంగల్ డిక్ల‌రేష‌న్‌లో చేసిన తీర్మాణాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్ర‌స్ధాయి ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ పీసీసీ చీఫ్ రేవంత్ అధ్య‌క్ష‌త‌న టీపీసీసీ విస్తృత స్ధాయి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ప్ర‌ధానంగా రైతు డిక్లరేషన్‌పై జనంలోకి వెళ్లడానికి కార్యాచరణ సిద్ధం చేయనున్నారు.

300 మంది నాయకులతో డిక్లరేషన్‌పై జనంలోకి వెళ్లాలని భావిస్తున్న పార్టీ నేత‌లు.. ఒక్కో నాయకుడికి 30 నుండి 40 గ్రామాల బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కార్య‌క్ర‌మానికి పల్లె పల్లెకు కాంగ్రెస్ అనే పేరును ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఓ వైపు ప‌ల్లె ప‌ల్లెకు కాంగ్రెస్ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తూనే మ‌రో వైపు రెండు భారీ మీటింగ్‌ల‌ను ప్లాన్ చేయాల‌ని టీకాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఎక్క‌డ స‌భ పెడితే బాగుంటుంద‌నే దానిపై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా రేవంత్ చేస్తున్న ప్ర‌య‌త్నం ఏ మేర‌కు స‌త్ఫ‌లితాన్నిస్తుందో వేచిచూడాలి..

- Advertisement -