బిగ్ బాస్ నుండి రాగానే పెళ్లి!

59
- Advertisement -

పల్లవి ప్రశాంత్…రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. మొదటి వారంలో లవ్ ట్రాక్‌తో, రెండోవారం రైతుబిడ్డగా సింపతి గెయిన్ చేస్తున్నారని ప్రశాంత్‌ని అంతా టార్గెట్ చేశారు. దీంతో ప్రజల్లో ప్రశాంత్‌ పట్ల సానుభూతి పెరిగిపోగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు ప్రశాంత్ తల్లిదండ్రులు.తన కొడుకు బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ఎంతోమంది సపోర్ట్ చేశారని తెలిపారు.

నా కొడుకు తిండి లేకచాలా ఇబ్బందులు పడ్డాడు. నా కొడుకు ఓ పాట తీస్తే వేరే వాళ్లు దాన్ని అమ్ముకున్నారు. ఆ విషయంలో నా కొడుకు చాలా బాధపడ్డాడు. తర్వాత అప్పు చేసి నా కొడుకుకి ఓ ఫోన్ కొనిచ్చాను. ఆ ఫోన్లో తీసిన వీడియోల వల్ల ఈరోజు నా కొడుకుకి బిగ్ బాస్ కి వెళ్ళాడని తెలిపింది ప్రశాంత్ తల్లిడు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కచ్చితంగా మా కొడుకుకి పెళ్లి చేస్తాం అని తెలిపింది.

హౌస్ లో రతికతో కలిసి ఉంటున్నాడు. కలిసి తింటున్నాడు. దాని గురించి ఏమంటారని అడగ్గా …ఆమె మా కొడుకుని వాడుకుంది. పల్లవి ప్రశాంత్‌తో ఉంటే ఆయనకు వచ్చే ఓట్లు కూడా నాకు వస్తాయని వాడుకుంది. అంతే తప్ప వేరే ఏం లేదు అని తెలిపింది. మా కొడుకు కూడా అందరిని అక్కా, చెల్లె అనే ఉద్దేశంతోనే చూస్తాడు. ఇక ఇంట్లో ఎలా ఉంటున్నాడో హౌస్ లో కూడా అలాగే ఉంటున్నాడు అని చెప్పుకొచ్చింది.

Also Read:CM KCR:వైద్యచరిత్రలో సువర్ణ అధ్యాయం

- Advertisement -