తాను ఎక్కడికి పారిపోలేదన్నారు బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్. తాను ఇంట్లోంచి వెళ్లి పోయినట్టుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అన్నారు. ఉదయం నా వ్యవసాయ పొలం వద్దకు లేళ్లాను.. కొంత సేపు అక్కడే రెస్ట్ తీసుకున్నాను అన్నారు. ఆ సమయం లో ఇంటికి వచ్చిన యూట్యూబర్లు అపోహ పడ్డారు…బిగ్ బాస్ హౌస్ బయట సంఘటన లకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు.
తనకు ఎవరి పట్ల వ్యతిరేకత లేదని… అక్కడ కొందరి కార్ల అద్దాలు పగులగొట్టడం చాలా బాధాకరం..అది ఎవరు చేసిండ్రో నాకు తెలియదు అన్నారు. తాను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాక ముందే ఆఘటనలు జరిగాయన్నారు. ఎవరినీ నేను కించపరిచేలా మాట్లాడలేదని…పోలీసులకు నా విజ్ఞప్తి.. నేను ఏ తప్పు చేయలేదు.. నావల్ల ఏమయినా ఇబ్బంది కలిగితే క్షమించండన్నారు. దయచేసి నన్ను ట్రోలింగ్ చేయకండి.. బిగ్ బాస్ లో నన్ను ఆదరించిన ప్రజలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:క్యాబేజీతో ఆరోగ్య ప్రయోజనాలు..!