రాష్ట్రంలో రైతులకు కరెంటు కష్టాలు తీర్చింది కేసిఆర్ ప్రభుత్వమే అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లాలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మార్పు రావాలంటే జనగామ జిల్లానే ముందుంటుంది. జిల్లాలో గత సంవత్సరం 74 వేల ఎకరాలు వరి పంట పండితే ఈ సారి రికార్డు స్థాయిలో 1,14,000 ఎకరాలలో పండింది. 33 జిల్లాలో ఎక్కువ పంట పండించింది జనగామ జిల్లాలోనే అని తెలిపారు.
ఇక నీళ్ళపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు అని.. పొన్నాలకు అసలే లేదు అన్నారు.రైతు భీమ జిల్లాలో 600 మందికి ఐదు లక్షల రూపాయలు వచ్చాయి.జనగామ చుట్టుపక్కల కూరగాయలు పెంచాలి.జనగామ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు.రైతులు ప్రభుత్వం సూచించిన పంటలనే వేయాలి అప్పుడే గిట్టుబాటు ధర వస్తుంది, రైతు లాభపడతాడు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.