కరోన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజాను కొనాలి సీఎం కేసీఆర్ చెప్పారని రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. పంట కొనుగోళ్లపై జరిగిన సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పంట కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపి క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేశారు. ప్రతి గింజ కొంటాం.. ప్రతి పైసా చెల్లిస్తాం అని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఏ రైతు ఇబ్బంది పడవద్దని రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
ఇప్పటికే 3008 వరీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది,దీని ద్వారా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 830 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా 78413 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేశాము. గత రబీ లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. వరి దాన్యానికి 25 వేల కోట్లు,మొక్కజొన్నకు 3200 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ధాన్యం స్టోరేజీ కోసం రైస్ మిల్లర్ లు ,ఎఫ్‌సిఐతో చర్చించామని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వరి,మొక్కజొన్న కోతలు ప్రారంభమై య్యాయి. రాష్ట్రంలో ప్రతి పక్షాలు ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర రైతాంగం ఆందోళన విడిచి ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రతి రైతు సీఎం కేసీఆర్‌లో తండ్రిని,ఓ నాయకుడిని చూసుకుంటున్నారు.
ఇక గన్ని బ్యాగ్ ల కొరత లేకుండా చూస్తున్నాం ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో చర్చించాం. ప్రస్తుతం 30 లక్షల మెట్రిక్ టన్నులకు సరీపోను అందుబాటులో ఉన్నాయి. ఇంకా కావాలి అంటే హెచ్ డి పి ఈ బ్యాగ్ లను తయ్యార్ చేసి వాడుతాం. ఎవరైనా ప్రతి పక్ష పార్టీల నాయకులు ఊర్లోకి పోతే రైతులు చికొడుతారు.శవాల మీద ప్యాలలు ఏరుకునే ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థ కుదేలు అయిన విషయం రాజకీయ పార్టీల నేతలు తెలుసుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.