రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది..

268
Palla Rajeshwer Reddy
- Advertisement -

దేవాదుల ప్రాజెక్ట్ నుండి మల్కాపూర్ చెరువు నింపి అక్కడి నుండి వరంగల్ అర్బన్ జిల్లా, వేలేరు మండల్ లోని ఐదు చెరువులకు గుండ్ల సాగర్ చెరువు నుండి నీటిని విడుదల చేశారు తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మొత్తం చెరువులు నిండటానికి 18 రోజులు పడుతుందని, కావున 18 రోజుల తరువాత ఈ చెరువులు నిండు కుండలా నిండి ఈ ప్రాంతంలోని అందరు రైతుల వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు రైతులు సదా రుణ పడి ఉంటామని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రతి ఒక్కరు నియంత్రిత సమగ్ర వ్యవసాయ పద్ధతులను పాటించి అధిక లాభసాటి పంటలను వేయాలి. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. తెలంగాణలో లాక్ డౌన్ నిబంధన ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపాధి కోల్పోయిన వారందరినీ ఆదుకున్నారు. రైతులు వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించారు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఎఫ్ సి ఐ దేశం మొత్తంలో సేకరించిన ధాన్యంలో 60 శాతం ధాన్యం ఒక తెలంగాణ నుండి తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అయింది. రైతులు ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నియంత్రిత సాగు విధానం పాటించాలన్నారు. రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినన్ని పథకాలు ప్రకటించలేదని పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -