- Advertisement -
ఈ రోజు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ జిల్లాలోని లింగాలఘనపురం మండలం నెల్లుట్ల, పటేల్‌గూడెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రాజయ్యతో కాలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన సన్నధాన్యం ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.
సన్నరకం ధాన్యం ధర విషయంలో సీఎం కేసీఆర్ కేంద్రానికి, ఎఫ్‌సీఐకి లేఖ రాశారని తెలిపారు. కాని వారు తాము నిర్ణయించిన ఎంఎస్‌పీ కంటే ఎవరు ఎక్కువగా బోనస్‌లాంటివి చెల్లించినా ధాన్యాన్ని కొనుగోలు చేయమని షరతు విధించించారని వివరాలను వెల్లడించారు.రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారని పల్లా వివరించారు.
- Advertisement -