ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం ప్రైవేట్ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన వైద్యుల ఆత్మీయ సమావేశంలో అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డితో కలిసి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మంత్రి మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డిని మొదటి(1)ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైద్యులను అభ్యర్దించారు. సమాజంలో కెల్లా ఉన్నత రంగమైన వైద్య వృత్తిలో ఉన్న మీరు సమాజాన్ని ఆరోగ్యవంతంగా నిలబెట్టే మహోన్నతమైన రంగంలో ఉన్నారని అన్నారు. అనుకోని పరిస్థితుల్లో అనూహ్యంగా వచ్చిపడిన కరోన క్లిష్టపరిస్థితుల్లో మీరు అందించిన సేవలు అద్భుతం. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎంతో తక్కువ నష్టంతో మనం ఆ పరిస్థితుల నుండి తప్పించుకోగలిగాం. అందుకు మీ కృషి విలువ కట్టలేనిదని వ్యాఖ్యానించారు.
అనేక రాష్ట్రాలు కరోనా తాకిడికి చితికిపోయాయని అనేక రంగాలు కుదేలయ్యాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట వైద్య సౌకర్యాలతో ప్రతి సామాన్యుడికి అందుబాటులో వైద్యం అందించగలిగారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డిని కేసీఆర్ మన ముందు ఉంచారన్నారు. వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
వైద్యులు మాట్లాడుతూ.. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికలలో టీఆర్‌ఎస్. అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి వైద్యులు తమ మద్దతు తెలిపారు. ప్రైవేట్ పార మెడికల్, హాస్పిటల్ ల యాజమాన్యాలు మరియు అనుబంధ రంగాల్లో పని చేస్తున్న పట్టభద్రుల తరఫున మద్దతును ప్రకటిస్తూ సభాలో హామీ ఇచ్చారు. తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేయించుటకు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, తమకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో పని చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలియజేశారు.