ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం జిల్లా కల్లూరులోని శనివారం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కొంత మంది అవాకులు, చెవాకులు పేలుతున్నారు. వాళ్లని ఎండ గట్టాలి. అరవై ఏళ్ల పాలన…ఆరేళ్ల పాలన చూడాలి. భక్త రామదాసు ప్రాజెక్టు 11 నెలలో పూర్తి చేశాం. సీతారామ ప్రాజెక్టు పూర్తి కానుంది. చెరువులకి పూర్వ వైభవం తెచ్చాం. బీజేపీ విమర్శలకి మనలోని కొద్ది మంది అనుమాన పడుతున్నారు.
ఆర్ధికవృద్ధి రేటు 14.2% పెరిగింది. అప్పులు ఎక్కువ చేయలేదు. రూ. 15 వేల కోట్లు రైతులకు రైతు బందు ఇచ్చాం. 2,600 మంది అగ్రికల్చర్ అధికారులున్నారు. పోలీసులు 32 వేల మంది, ఆర్‌టీసీలోకి 5,500 మందిని తీసుకున్నాం. నియమాకాల విషయంలో అవాస్తవాలు , అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగుల ప్రకటనపై తప్పులు చూపిస్తే పోటీ నుండి తప్పు కుంటా అని సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ పీఆర్‌సీ ఇచ్చి తీరుతారు. అరేళ్లుగా పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పని చేశా. సమస్యలపై ప్రశ్నించే మీ అందరి గొంతుక అవుతానని పల్లా పేర్కొన్నారు.