నెటిజెన్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన అనసూయ..

26
Anchor Anasuya

తెలుగు బుల్లి తెర అందాల యాంకర్ అనసూయ అటు సినిమాల్లో ఇటు యాంకర్‌గా ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుంటుంది. తాజాగా ఒక ఫొటోను ఆమె షేర్ చేసింది. దీనిపై ఒక నెటిజెన్ ఓ మీమ్ క్రియేట్ చేశాడు. నువ్వేమైనా సమంత అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు.

దీనికి సమాధానంగా ‘అయ్యో లేదమ్మా… నన్ను అనసూయ అంటారు’ అని సమాధానం ఇచ్చింది. అనసూయ రెస్పాన్స్ పై సదరు నెటిజెన్ స్పందిస్తూ… క్షమించండి మేడమ్, ఆటపట్టించడం కోసమే సరదాగా అన్నానని చెప్పాడు. అయినా అనసూయ శాంతించలేదు. నువ్వు మానసికంగా ఇంకా చిన్నపిల్లాడివే అని తనకు అర్థమయిందని… నువ్వు త్వరగా ఎదగాలని కోరుకుంటున్నానని కౌంటర్ ఇచ్చింది. ఈ అమ్మడు నెటిజెన్లపై గతంలోనూ చాలా సార్లు ఫైర్‌ అయింది.