తెలంగాణలో నేడు మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఒకప్పుడు కరువు గుప్పిట్లో విలవిలలాడిన ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇకపై జలకల సంతరించుకొనుంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2015 లో రూ.35 వేల కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకున్న, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైన పట్టు విడువకుండా నిరంకుశ దీక్షా పూని ముఖ్యమంత్రి కేసిఆర్.. ప్రపంచమే ఔరా అనేలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ను చేపట్టారు. .
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందనుంది. ఒకప్పుడు కరువు కు కేరాఫ్ అడ్రస్ గా ఉండి వలసల బాటా పట్టిన ఇక్కడి ప్రజలు ఇప్పుడు కృష్ణమ్మ రాకతో రైతుగా తమను తాము దేశానికి అంకితం కానున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కోడంగల్, నారాయణ పేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి,.. ఇలా ఆయా నియోజిక వర్గాలలోని 70 మండలాలకు పుష్కలంగా సాగు నీరు అందనుంది.
Also Read:సైమా అవార్డ్స్ -2023 విజేతలు వీరే..
ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో బాగంగా 5 లిఫ్ట్ స్టేజిలు, 6 రిజర్వాయర్లు, 67.74 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం,. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పథకంలో ప్రధాన అంశాలు చాలా ఎక్కువే. ఆసియా లోనే అతిపెద్ద సర్జ ఫూల్ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నిలువనుంది. ఇక అత్యధిక సామర్థ్యం గలిగిన పంపుల వినియోగంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే ఈ ప్రాజెక్టే ఎక్కువ. మొత్తానికి దశాబ్దాలుగా కరువుతో విలవిలాడిన పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ నెరవేర్చి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కృతం చేశారు. ప్రపంచంలోనే మేటి ప్రాజెక్ట్ లు అయిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లు తెలంగాణలో ఉండడం రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం.