సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం…

350
cm kcr photo
- Advertisement -

రైతు రుణమాఫీ,రైతు బంధు నిధులను విడుదల చేసినందుకు రైతుల్లో ఆనందం వెల్లవిరుస్తోంది. సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. కరీంనగ్ జిల్లా చొప్పదండి మండలం సాంబయ్య పల్లి గ్రామంతో పాటు సంగారెడ్డి జిల్లా అందోల్ మండం జోగిపేట హనుమాన్ చౌరాస్తాలో పాలాభిషేకం నిర్వహించారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం సాంబయ్య పల్లి గ్రామం లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్ , జెడ్పీటీసీ మాచర్ల సౌజన్య వినయ్ కుమార్, సింగిల్ విండో చైర్మన్ వేల్మ మల్లారెడ్డి , గ్రామ సర్పంచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట హనుమాన్ చౌరాస్తా వద్ద రైతులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్యెల్యే చంటి క్రాంతి కిరణ్. రైతులకు రైతు బంధు,రైతు రుణమాఫీ చేసినందుకు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు క్రాంతి కిరణ్.

ఏ రైతు కూడా ఫెర్టిలైజర్ షాపుల్లో ఉద్దేరా పెట్టకుండా కేసీఆర్ వేసిన రైతు బంధు డబ్బులతో యూరియా మందును కొనుగోలు చేయాలన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్ధితుల్లో రైతులకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -