సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

107
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ రాష్ట్రం వచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన కేసీఆర్ దీక్ష ఫలితంగా అప్పటి యూపీఏ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పోరాటానికి దిగి వచ్చి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రన్ని ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమించాలని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించిన రోజు డిసెంబర్ 9 అని దానికి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందని అందుకే ఆరోజును గుర్తు చేసుకుంటూ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపనికి నివాళులర్పిస్తూ, సీఎం కేసీఆర్ చిత్ర పటానికి విద్యార్థి ఉద్యమ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, బిసి కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్.

ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. నవంబర్ 29,2009 సంవత్సరంలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఉద్యమ నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగిందని దాని ఫలితంగానే డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రం తెలంగాణ ప్రకటనను చేయడం జరిగింది అని అన్నారు. కానీ వచ్చిన తెలంగాణను ఆపడానికి అప్పటి ఆంధ్ర పాలకులు ఎన్నో కుట్రలు చేసిన అప్పటి యూపీఏ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు పోతుంటే సహకరించాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కులకు అడ్డుపడుతూ సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని మండిపడ్డారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. లేని పక్షంలో ఆనాడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించామో అదే ఉద్యమ స్ఫూర్తితో నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి సీఎం కేసీఆర్ నాయకత్వంలో మా న్యాయమైన హక్కులు సాదించికుంటాం అని అన్నారు.

మొన్న బీజేపీ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడని అసలు ఉద్యమంలో మల్లన్న పాత్ర ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కానీ, కేటీఆర్ పైన గాని వారి కుటుంబ సభ్యులపై కానీ అనుచితమైన వ్యాఖ్యలు చేసే చూస్తూ ఊరుకోమని టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని ఉద్యమకారులు నిన్ను తరిమి తరిమి కొడతారని బాబా ఫసియుద్దీన్ హెచ్చరించారు.

కిషోర్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9 రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని అన్నారు.నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సి ,ఎస్టి, బిసి, మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు అని తెలిపారు. ఇప్పటికే దాదాపు 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఉచిత విద్యను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది అని అన్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని మాలాంటి విద్యార్థి నాయకులకు ఉన్నతమైన పదవులు కట్టబెట్టడం కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని కిషోర్ గౌడ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ అల్లిపూర్ వెంకటేశ్వర్ రెడ్డి, టిఆర్‌ఎస్‌వీ విద్యార్థి నాయకులు వినీత్ కుమార్, మేకల రవి, శ్రీకాంత్, అనిల్, ప్రణీత్, కృష్ణ, నవీన్, ఇలియాస్, జహీర్, పాండు, మధుకర్, సతీష్, సన్నీ, ముఖేష్, అబ్బు,లడ్డు, జంగయ్య, అవినాష్, అఖిల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహ ముదిరాజ్, గోషామహల్, మహేందర్, పరమేశ్వరి సింగ్, పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -