డిసెంబర్ 31న రానా ‘1945’..

141
- Advertisement -

బాహుబలి లాంటి సినిమా తరువాత హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి భిన్న రకాల చిత్రాలను ఓకే చేశారు. అందులో 1945 ఒకటి. ఈ పీరియడ్ డ్రామాను సత్యశివ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సీ కళ్యాణ్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 1945 సినిమా డిసెంబర్ 31న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు.

ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో రానా బ్రిటీష్ జెండాను కాల్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. స్వాతంత్ర్య సమర యోధుడి పాత్రను రానా పోషించారు. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. సత్య కెమెరామెన్‌గా, గోపీ కృష్ణ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -