సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన దళిత నాయకులు..

230
Palabhishekam To CM KCR
- Advertisement -

సీఎం దళిత సాధికారికత పథకం ఏర్పాటు చేయడం దళిత వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి అవుతాయని, అలాగే విద్య పరంగా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా,ముందు అడుగు వేయడంలో సీఎం కేసీఆర్‌ చూపిస్తున్న చొరవ అద్బుతం అని టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్ దళిత నాయకులు, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు కొనియాడారు.

సీఎం దళిత సాధికారికత పథకం ఏర్పాటు చేసినందుకు ఈ రోజు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, టీపీయూఎస్‌,టీఆర్‌ఎస్‌ నాయకులు మోహన్ నాయక్, సంపత్‌, రాజు, సురేందర్ మాదిగ,మహిళ నాయకురాలు లీల, సాయి లక్ష్మి, అరుణ జ్యోతి తదితర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంధం రాములు మాట్లాడుతూ.. సీఎం దళిత సాధికారికత పథకం ద్వారా ఎంతో మంది దళితుల బతుకులు భాగుపడతాయాని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన 7 సంత్సరకాలంలో దళితుల అభివృద్ధి కోసం 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం చాలా సంతోషం ఉంది.. మళ్ళీ నేడు 1200 కోట్లు ప్రకటించడం ఇంకా అవసరం పడితే 500 కోట్లు ఇస్తం అని అఖిల పక్షం సమావేశంలో సీఎం తెలపడం.. పేద దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇచ్చే విధానం, విదేశీ చదువులకు కూడా ఎక్కువ బడ్జెట్ నిర్ణయించడం అభినందనీయం అన్నారు.

అలాగే ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియమాకలలో రిజ్వేషన్లు ఏర్పాటు చేయడం చాలా సహసోతమైన కార్యక్రమం అని రాములు తెలిపారు. దళిత ఉద్యోగులకు పదోన్నతి కార్యక్రమం కూడా వేగ వంతం చేయడం సంతోషం అని.. మా దళిత బతుకుల్లో సీఎం కేసీఆర్‌ అంబేడ్కర్‌ల కనిపిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు దళిత జాతి మొత్తం రుణ పడి ఉంటుదని గంధం రాములు తెలియజేశారు.

- Advertisement -