సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

58
cm kcr

నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో బాగంగా డి 82 కాల్వ నిర్మాణం పనులు పూర్తిచేసి టేలెండ్ ప్రాంతమైన నాగిళ్ల వరకు సాగునీరు అందించేందుకు సిఎం కెసిఆర్ 150 కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ రైతులు పాలాభిషేకం చేశారు.

కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో రైతులు,టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు రైతులు ధన్యవాదాలు తెలిపారు.