కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్

339
somesh kumar
- Advertisement -

రాష్ట్రంలోని 17 జిల్లాలకు స్థానిక సంస్థల కోసం అదనపు కలెక్టర్ల నియామకంతో మొత్తం 29 మంది అదనపు కలెక్టర్లను స్థానిక వ్యవహారాలను పర్యవేక్షించుటకు నియమించిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ పట్టణప్రగతి, రైతు వేదికల నిర్మాణం, మునిసిపాలిటీలలో కొత్తగా చేర్చిన గ్రామ పంచాయతీల అభివృద్ధి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, మునిసిపల్ చట్టం, మునిసిపాలిటీలలో కొత్తగా చేర్చిన గ్రామాలలో క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం అవకాశం కల్పిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్నారు. మునిసిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలపై, disinfectant spraying పై, Anti-larval, వెక్టర్ బర్న్ వ్యాధుల నివారణ చర్యలపై ప్రత్యెక దృష్టి కొనసాగిస్తూ మరింత విస్తృతంగా చేపట్టాలన్నారు.

రైతువేదికలకు సంబంధించి మిగిలిన మంజూరి పనులను వేగవంతం చేసి, ఈ నెల 18 తేది నాటికి ఫిజికల్ గ్రౌండిoగ్ ను పూర్తి చేయాలన్నారు. రైతు వేదికల నిర్మాణ పనుల పర్యవేక్షణకు సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించాలన్నారు. వీటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ప్రొక్యూర్ మెంట్ కు తగు ప్రణాళికను రూపొందించుకొని నిర్మాణ పనులలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలన్నారు. అక్టోబర్ 10 వ తేదీనాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.వీటితో పాటు రైతు బంధు, కల్లాల నిర్మాణం, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కోసం స్థలాల ఎంపికతో పాటు ఉపాధి హామీ ద్వారా వివిధ శాఖలలో చేపడుతున్న కన్వర్జెన్స్ పనులపై సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలన్నారు.

ఈ సమావేశంలో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అరవింద్ కుమార్, వ్యవసాయ శాఖ సెక్రటరీ శ్రీ జనార్దన్ రెడ్డి, పంచాయత్ రాజ్, గ్రామీణాభివ్రుద్ది శాఖ సెక్రటరి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శ్రీ రఘునందన్ రావు, జి.హెచ్.ఎం.సి. కమిషనర్ శ్రీ లోకేష్ కుమార్, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -