- Advertisement -
రాష్ట్రంలో కొత్తగా 6 మెడికల్ కళాశాలలు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, 12 ప్రాంతీయ ఔషధ ఉప కేంద్రాలు, 40 ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంపట్ల సర్వత్రా హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. పలు జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక మరింత మెరుగైన వైద్యం అందుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -