రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హరీశ్‌ రావు సమీక్ష

49
harish

రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై సమీక్ష నిర్వహించారు మంత్రి హరీశ్‌ రావు. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో క‌రోనాపై సమీక్ష నిర్వహించిన హరీశ్… ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌తో పాటు వైద్యారోగ్య శాఖ‌ అధికారులు హాజ‌ర‌య్యారు.

కొవిడ్ చికిత్స‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు, ఔష‌ధాల‌పై చ‌ర్చించగా ఈ సమావేశాని కంటే ముందు మంత్రి హ‌రీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ కోఠి ఈఎన్‌టీ ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. కోఠి ఈఎన్‌టీ ఆస్ప‌త్రిని బ్లాక్ ఫంగ‌స్‌కు నోడ‌ల్ కేంద్రంగా ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

మరోవైపు కరోనాతో దేశవ్యాప్తంగా 270 మంది వైద్యులు మృతిచెందారు. కరోనాతో మృతి చెందిన వైద్యుల జాబితాలో ఐఎంజీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కేకే అగర్వాల్ సైతం ఉన్నారు. బిహార్‌లో అత్యధికంగా 78 మంది, ఉత్తరప్రదేశ్‌లో 37 మంది, ఢిల్లీలో 29 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 22 మంది మరణించారు.