టాలీవుడ్ హీరో గోపీచంద్- మారుతి కాంబోలో వస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. యాక్షన్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2, యూవీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించాడు. జూలై 1వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. ఇక పూర్తి ట్రైలర్ ను ఈ నెల 12వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు.
కాగా, గోపీచంద్-రాశి ఖన్నా కలిసి ‘జిల్’ సినిమాలో రొమాన్స్ చేశారు. అలాగే మారుతి- రాశి ఖన్నా కాంబినేషన్ లో ‘ప్రతి రోజూ పండగే’ సినిమా వచ్చి విజయం సాధించింది. అందువలన ‘పక్కా కమర్షియల్’ పై అందరిలో ఆసక్తి రేపుతోంది. కొంతకాలంగా ఇటు మారుతికి .. అటు గోపీచంద్ – రాశి ఖన్నాకి సక్సెస్ లేదు. అందువలన ఈ సినిమాపైనే ఈ ముగ్గురూ గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.