రివ్యూ: పక్కా కమర్షియల్

319
gopichand
- Advertisement -

మారుతి దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్….సక్సెస్ ఫుల్ సినిమాలా దర్శకుడు మారుతి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. మరి గోపిచంద్ ఈ సినిమాతో సక్సెస్ కొడతాడో లేదో వేచిచూద్దాం..
కథ:
హీరో గోపీచంద్, హీరోయిన్ రాశీ ఖన్నా ఇద్దరు లాయర్లు. గోపీచంద్ తండ్రి సత్యరాజ్.. జడ్జి. ఎన్నో కేసులు వాదించి జడ్జిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడు. కానీ రామ్ చంద్(గోపీచంద్) మాత్రం పక్కా కమర్షియల్. ఇద్దరి అభిప్రాయాలు వేరు. అందుకే.. ఇద్దరి మధ్య చాలా విభేదాలు వస్తుంటాయి. సీన్ కట్ చేస్తే అసిస్టెంట్ గా గోపీచంద్ దగ్గర జాయిన్ అవుతుంది రాశీ ఖన్నా. తర్వాత ఇద్దరు ప్రేమలో పడతారు…తర్వాత ఏం జరుగుతుంది…? గోపీచంద్ తన తండ్రికి ఎందుకుదూరం అవుతారు..?చివరికి కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే పక్కా కమర్షియల్ కథ.
ప్లస్ పాయింట్స్‌:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కామెడీ,సినిమాటోగ్రఫీ,సాంకేతిక విభాగం, గోపిచంద్ నటన. గోపిచంద్ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. లాయర్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక రాశీ ఖన్నా తన అందంతో సినిమాకు మరింత ప్లస్‌గా మారింది. ముఖ్య పాత్రల్లో నటించిన సత్యరాజ్, రావు రమేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్, సప్తగిరి అదరగొట్టేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ పాటలు, కన్ క్లూజన్.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. మారుతి రాసుకున్న కథకు సరిగ్గా సూట్ అయ్యాడు గోపిచంద్. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు. లౌక్యం సినిమాలో ఎలాగైతే బాడీ లాంగ్వేజ్ ను గోపీచంద్ మెయిన్ టెన్ చేశాడో ఈ సినిమాలోనూ అదే ఎనర్జీతో నటించాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ దర్శకుల్లో ఒకరు మారుతి. తాను ఎంచుకున్న కథను సూటిగా చెప్పడమే కాదు అందులో కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పిస్తాడు. తాజాగా పక్కా కమర్షియల్ సినిమాలో కూడా అదే ప్రయత్నమే చేసి సక్సెస్ సాధించాడు. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో అందరికి నచ్చే చిత్రం పక్కా కమర్షియల్.
విడుదల తేదీ:01/07/2022
రేటింగ్:2.75/5
నటీనటులు : గోపీచంద్, రాశి ఖన్నా
సంగీతం : జేక్స్ బెజోయ్
నిర్మాత : బన్నీ వాసు
దర్శకత్వం : మారుతి

- Advertisement -