పాక్ ప్రధానిపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు..

197
pak
- Advertisement -

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆ దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశాన్ని పాలించే పద్దతి ఇది కాదని..అసలు దేశాన్ని పాలించడం వచ్చా అని మండిపడింది. గత రెండు నెలలుగా కామన్ ఇంటరెస్ట్ కౌన్సిల్ (సీసీఐ) సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.

దేశం ఈ పద్ధతిలో నడుస్తుందా అని అడిగిన న్యాయమూర్తి.. ప్రావిన్స్‌తోపాటు కేంద్రం ఏమి చేస్తున్నాయో దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని అక్కడి పత్రికలు నివేదించాయి. పంజాబ్ స్థానిక ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రకటించడంపై ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పంజాబ్ ప్రభుత్వం ఇష్టపడటం లేదని, ఒక వ్యక్తి అభ్యర్థన మేరకు మొత్తం పంజాబ్ అసెంబ్లీ బైపాస్ అయిందని జస్టిస్‌ ఇసా అన్నారు. దేశాన్ని నడిపించడానికి జనాభా గణన ప్రాథమిక అవసరమని …జనాభా లెక్కల ఫలితాలను విడుదల చేయడం ప్రభుత్వ ప్రాధాన్యం కాదా? మూడు ప్రావిన్సులలో ప్రభుత్వం ఉన్నప్పటికీ, మండలిలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు? ..సీసీఐ నివేదికను ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు.

- Advertisement -