కరోనా నియంత్రణలో భారత్‌ కంటే పాక్ బెటర్‌: రాహుల్‌

189
rahul
- Advertisement -

మోడీ సర్కార్‌పై మరోసారి మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కరోనా నియంత్రణలో భారత్ కంటే పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్తాన్ బెటర్‌గా పనిచేశాయని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఐఎంఎఫ్ ప్రస్తావించిన అంశాలను గుర్తు చేస్తూ ఈ ఏడాది భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ 10.3 శాతం కుంచించుకుపోతుంద‌ని తెలిపిందని..బీజేపీ ప్ర‌భుత్వం అద్భుత‌మైన ఘ‌న‌త సాధించిందని ఎద్దేవా చేశారు.

ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్ ఇచ్చిన వృద్ధి అంచ‌నాల‌కు సంబంధించి రిలీజ్ చేసిన గ్రాఫ్‌ని షేర్ చేస్తూ మోడీ సర్కార్‌ తీరుని ఎండగట్టారు. బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్‌, నేపాల్‌, చైనా, భూటాన్‌, పాకిస్థాన్‌, శ్రీలంక‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, ఇండియా దేశాల లెక్క‌లు ఇలా ఉన్నాయి.

- Advertisement -