పాక్‌ని ముంచెత్తిన వరదలు..

132
pak
- Advertisement -

దాయాది పాకిస్థాన్‌ను వరదలు ముంచెత్తాయి. దేశంలోని మూడో వంతు భాగం ముంపుకు గురికాగా దాదాపు 1400 మంది ప్రాణాలు కొల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 3 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సివచ్చింది. ఇక బలూచిస్థాన్‌లో వరదల బారిన ప్రజలను హిందూ ఆలయం అక్కున చేర్చుకుంది. వందలాది మంది ప్రజలకు ఆశ్రయం కల్పించింది.

బలూచిస్థాన్‌లోని కచ్చి జిల్లాలో జలాల్ ఖాన్ అనే గ్రామం ఉంది. నార్ని, బోలాన్, లేహ్రీ నదులు ఉప్పొంగి ఈ ఊరిని ముంచెత్తాయి. బాహ్య ప్రపంచంతో ఈ గ్రామానికి సంబంధాలు తెగిపోవడంతో.. ప్రభుత్వం హెలికాఫ్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లను జారవిడిచేది. కానీ పరిస్థితి చేయి దాటుతుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. దీంతో ఊళ్లో ఉన్న హిందువులు వరద బాధితులకు ఆశ్రయం కల్పించడం కోసం స్థానిక బాబా మధోదాస్ మందిరం తలుపులు తెరిచారు.

బాబా మధోదాస్ అనే వ్యక్తి ఓ సాధువు. ఆయన పట్ల హిందువులతోపాటు ముస్లింలు కూడా గౌరవంతో మెలిగేవారు. అందుకే ఇక్కడ పెద్ద ఆలయాన్ని నిర్మించారు. ఏటా బలూచిస్థాన్, సింధ్ ప్రావిన్స్‌ల నుంచి వందలాది మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

- Advertisement -