భారత్‌పై పాక్ ఘన విజయం

127
pak
- Advertisement -

వరల్డ్ కప్‌లో భారత్‌పై పాక్ ఘన విజయం సాధించింది. అన్నిరంగాల్లో భారత్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించిన పాక్‌ 10 వికెట్ల తేడాతో గెలిచి భారత్‌ని చిత్తు చేసింది. భారత్ విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా చేధించింది పాక్. ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 నాటౌట్‌), బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 నాటౌట్‌) ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించారు. టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థిపై పది వికెట్ల తేడాతో గెలిచిన నాలుగో జట్టుగా పాకిస్థాన్‌ నిలిచింది.

ఇక అంతకముందు టాస్ గెలిచిన పాక్…భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. కోహ్లీ (49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 57), పంత్‌ (30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39) మాత్రమే మెరుగ్గా రాణించారు. షహీన్‌కు మూడు, హసన్‌ అలీకి రెండు వికెట్లు దక్కాయి. భారత్ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. దీంతో కోహ్లీ సేనకు పరాజయం తప్పలేదు.

- Advertisement -