బిగ్ బాస్ 5: ఈ వారం ప్రియా ఎలిమినేట్..!

48

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటే ఆరుగురు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఇంట్లో 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.ఈ ఏడవ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠని పెంచేస్తోంది. నామినేషన్‌లో ఉన్న వారిలో ముఖ్యంగా అనీమాస్టర్, లోబో, ప్రియా డేంజర్ జోన్‌లో ఉన్నారు.

అయితే తెలుస్తోన్న తాజా సమాచారం మేరకు లోబోకు, అనీ మాస్టర్‌కు ప్రియాతో పోల్చితే కాస్తా ఎక్కువుగా ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఈ వారం ప్రియా బిగ్ హౌజ్‌నుంచి ఎలిమినేట్ అయ్యినట్లు తెలుస్తోంది. ప్రియా విషయానికి వస్తే.. మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ లోనే హౌస్ లోకి వెళ్లింది ప్రియా.. అయినా కూడా మిగితా వారి కంటే తక్కువుగా ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యిందని సమాచారం. ఈ విషయం తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.