టీ20 వరల్డ్ కప్‌లో పాక్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో విజయం సాధించి సెమీస్ బెర్త్ రేసులో ముందంజలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ విధించిన 148 పరుగుల లక్ష్యన్ని 19 ఓవర్లలో చేధించింది. చివర్లో ఆసిఫ్ అలీ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 7 బంతుల్లో 25, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడూ బాబర్ అజమ్(51, 47 బంతులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో పాక్ విజయం సాధించింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ కుప్పకూలిని చివర్లో కెప్టెన్ మహ్మద్ నబీ 35, గుల్బదిన్ నయిబ్ 35 పరుగులు కలిసి ఏడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో అఫ్గనిస్తాన్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఇమాద్ వసీమ్ రెండు వికెట్లు తీయగా.. షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ, షాబాద్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు.